అక్షరటుడే, బాన్సువాడ : TS MESA | టీఎస్ మెసా (తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్) బాన్సువాడ డివిజన్ (Banswada Division) నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శనివారం ఆవిష్కరించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి క్యాలెండర్‌ను విడుదల చేశారు.
TS MESA | సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి..
ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి (DSP Vithal Reddy) మాట్లాడుతూ.. సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో కూడా సంఘం చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ సేవల్లో మైనారిటీ ఉద్యోగులు బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేస్తూ సమాజ అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాన్సువాడ మైనారిటీ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు సయ్యద్ వహాబ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ హాజీ, కోశాధికారి సయ్యద్ అబ్దుల్ రజాక్, మహమ్మద్ అక్బర్, ఇమ్రాన్, రజాక్, అబ్దుల్ హఫీస్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.