Homeబిజినెస్​Stock Market | ట్రంప్‌ బెదిరింపులు.. ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

Stock Market | ట్రంప్‌ బెదిరింపులు.. ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | యూఎస్‌(US) టారిఫ్‌ పాజ్‌ గడువు సమీపిస్తుండడం, బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా నిలిచే దేశాలపై 10 శాతం అదనపు సుంకాలను విధిస్తామన్న డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బెదిరింపుల నేపథ్యంలో గ్లోబల్‌ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అయితే భారత మార్కెట్లు మాత్రం స్పల్ప ఒడిదుడుకులతో లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. సోమవారం ఉదయం సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌(Sensex) 34 పాయింట్లు, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో ట్రేడిరగ్‌ ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 83,262 నుంచి 83,516 పాయింట్ల మధ్య, నిఫ్టీ(Nifty) 23,407 నుంచి 23,489 పాయింట్ల మధ్య కదలాడుతున్నాయి.

Stock Market | మిశ్రమంగా సూచీలు

ప్రధాన సూచీలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.14 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్‌ 0.74 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.69 శాతం, ఎనర్జీ సూచీ 0.51 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 0.40 శాతం లాభాలతో ఉన్నాయి. టెలికాం సూచీ 0.80 శాతం నష్టాలతో ఉండగా.. కమోడిటీ 0.50 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.41 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.49 శాతం నష్టాలతో సాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.09 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.06 శాతం లాభంతో ఉండగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.13 శాతం నష్టంతో కదలాడుతోంది.

Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో 18 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌ 2.64 శాతం, ఆసియా పెయింట్‌ 1.40 శాతం, ట్రెంట్‌ 0.97 శాతం, ఎన్టీపీసీ 0.88 శాతం, ఐటీసీ 0.78 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers:బీఈఎల్‌ 1.78 శాతం, టెక్‌ మహీంద్రా 1.39 శాతం, ఎటర్నల్‌ 1.11 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.99 శాతం, మారుతి 0.98 శాతం నష్టాలతో ఉన్నాయి.

Read all the Latest News on Aksharatoday.in

Must Read
Related News