అక్షరటుడే, వెబ్‌డెస్క్: truck and car collided : కారు, కంటైనర్ ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. సత్ ఫూల్ వంతెన వద్ద కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వేగానికి కారు నుజ్జునుజ్జు అయింది. వేగం ఎక్కువగా ఉండటంతో కారులో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు.
truck and car collided : కొత్తగా ఎన్నికైన సర్పంచికి గాయాలు
హైదరాబాద్‌లోని రెయిన్ బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తమ బందువులను మాట్లాడించి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. మృతులు కుబీర్ మండలంలోని కుష్టి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.. మృతులను బాబన్న (70), రాజన్న(60), భోజరం పటేల్(42), డ్రైవర్ వికాస్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ఇటీవల ఎన్నికైన సర్పంచి గంగాధర్ తలకు కూడా గాయాలయ్యాయి. ఆయన్ను భైంసా ఆసుపత్రికి అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు.