- Advertisement -
Homeలైఫ్​స్టైల్​tropanin test | గుండెపోటును నిర్ధారించడానికి ఈసీజీ(ECG) సరిపోతుందా..!

tropanin test | గుండెపోటును నిర్ధారించడానికి ఈసీజీ(ECG) సరిపోతుందా..!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: tropanin test | ఓ పత్రికా విలేరికి కొద్దిగా ఛాతినొప్పి వచ్చింది. ఆయన వెంటనే ఈసీజీ చేయించుకున్నారు. ఫలితాలు అంతా నార్మల్​గానే వచ్చాయి.

కానీ ఆ తర్వాత జరిగిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకో ఈయనకు అనుమానం రావడంతో ట్రోపనిన్ టెస్ట్ tropanin test చేయించుకున్నారు.

- Advertisement -

ట్రోపనిన్ పరీక్ష అనేది గుండె కండరాలకు హాని కలిగినప్పుడు.. ఆ కణాల నుంచి రక్తంలోకి విడుదలయ్యే ఒక రకమైన ప్రొటీన్‌ను కొలిచే రక్త పరీక్ష.

గుండెపోటు సంభవించినప్పుడు.. గుండె కండరాలు దెబ్బతిని, ఈ ట్రోపనిన్ ప్రొటీన్ protein రక్తంలోకి విడుదల అవుతుంది. కాబట్టి, ఈ పరీక్ష ద్వారా రక్తంలో ట్రోపనిన్ స్థాయిలను కొలిచి గుండెపోటు వచ్చిందా.. లేదా.. అనేది నిర్ధారించవచ్చు.

ఈ సులభంమైన రక్త పరీక్ష గుండెలో గల సమస్యను, ఈసీజీ గుర్తించలేని ఏడు తీవ్రమైన అడ్డంకులను (బ్లాక్) బయటపెడుతుంది. దీనిలో చిన్న మార్పు కూడా గుండె సమస్యలను ముందుగానే చూపిస్తుంది.

ఈసీజీ ECG అనేది గుండె విద్యుత్తు సంకేతాలను మాత్రమే చూపిస్తుంది. కానీ, ట్రోపనిన్ గుండెపోటు సమస్యలు తీవ్రమవడానికి ముందే గుర్తిస్తుంది.

tropanin test | ట్రోపనిన్ పరీక్ష ప్రాముఖ్యం..

గుండెపోటును గుర్తించడం: ఛాతి నొప్పి లేదా గుండెపోటు లక్షణాలు ఉన్నవారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. రక్తం blood లో ట్రోపనిన్ స్థాయిలు పెరిగితే.. అది గుండెపోటును సూచిస్తుంది.

ఈసీజీతో పోలిక: ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్) గుండె విద్యుత్తు సంకేతాలను మాత్రమే కొలుస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో.. గుండెపోటు ఉన్నప్పటికీ ఈసీజీ ఫలితాలు సాధారణంగా ఉండవచ్చు.

అటువంటి పరిస్థితుల్లో ట్రోపనిన్ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది గుండె కండరాల నష్టాన్ని నేరుగా చూపిస్తుంది.

గుండెపోటును గుర్తించడం: కొన్నిసార్లు గుండెపోటు లక్షణాలు పెద్దగా లేకుండా, చాలా తేలికపాటి ఛాతి నొప్పి లేదా అసౌకర్యంతో ఉంటుంది. ఇలాంటి గుండెపోటులను కూడా ట్రోపనిన్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

ప్రాణాలను రక్షించడం: గుండెపోటును త్వరగా గుర్తించడం వల్ల సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, ప్రాణాలను రక్షించవచ్చు.

అందుకని ఏ మాత్రం అనుమానం ఉన్నా.. డాక్టర్ సలహా మేరకు ఈ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. కొంచం ఛాతి నొప్పిని కూడా తేలికగా తీసుకోకూడదు.

డాక్టర్‌ను ట్రోపనిన్ టెస్ట్ గురించి అడిగి తెలుసుకోవాలి. ఇది సులభమైంది.పెద్దగా ఖరీదైనది కూడా కాదు. గుండెపోటు బారి నుంచి ప్రాణాలను ముందే కాపాడుకోగలం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News