HomeతెలంగాణHyderabad Metro | హైదరాబాద్ మెట్రో​ సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్​జెండర్లు

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో​ సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్​జెండర్లు

హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ 20 మంది ట్రాన్స్​జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించింది. వీరు మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | సమాజంలో వివక్ష గురి అవుతున్న ట్రాన్స్​జెండర్లకు ఉపాధి విషయంలో ఇటీవల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​ మెట్రో రైలు సంస్థ 20 మంది ట్రాన్స్​జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించింది.

ట్రాన్స్​జెండర్ (Transgender)​ సెక్యూరిటీ సిబ్బంది మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని సంస్థ పేర్కొంది. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, బ్యాగేజ్ స్కానర్‌లలో సహాయం చేస్తారని, కీలకమైన స్టేషన్లు రైళ్లలో భద్రతను బలోపేతం చేస్తారని వెల్లడించింది. తమను విధుల్లోకి తీసుకోవడంపై ట్రాన్స్​జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.

Hyderabad Metro | ప్రభుత్వ ఉద్యోగాలు సైతం..

దేశంలో గతంలో ట్రాన్స్​జెండర్లు ఉద్యోగాలు చేసే వారు కాదు. చాలా మంది చదువుకు దూరమై.. యాచిస్తూ జీవనం సాగించేవారు. అయితే ఇటీవల ప్రభుత్వాలు, ఎన్జీవో (NGO)ల సాయంతో ట్రాన్స్​జెండర్లు సైతం చదువుకొని కొలువులు సాధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చేరుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Hyderabad Metro | వేధింపులు ఆగుతాయా..

రాష్ట్రంలో చాలా మంది ట్రాన్స్​జెండర్లు యాచిస్తూ జీవనం సాగిస్తారు. ఎక్కువగా రైళ్లలో అడుక్కుంటారు. అయితే వీరు ప్రజలను వేధిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే నానా హంగామా చేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, షాప్​ ఓపినింగ్​ సమయంలో హిజ్రాలు వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తారు. ఇవ్వకపోతే రచ్చ రచ్చ చేస్తారు. ఇటీవల హైదరాబాద్​లో గృహ ప్రవేశానికి రూ.50 వేలు డిమాండ్​ చేశారు. సదరు ఇంటి యజమాని ఇవ్వకపోవడంతో అతడిపై దాడి చేశారు. ఇలా చాలా సందర్భాల్లో ట్రాన్స్​జెండర్లు ప్రజలు ఇచ్చింది తీసుకోకుండా.. వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు, వివిధ సంస్థలు వారికి శిక్షణ ఇచ్చి, కొలువులు ఇస్తుండటంతో వారి వేధింపులు ఆగుతాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Must Read
Related News