అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inspector Transfers | సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mahanty) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మందికి స్థాన చలనం కలిగించారు.
Inspector Transfers | తొమ్మిది మంది బదిలీ
శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఠాణా ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న కె.బాలరాజును గచ్చిబౌలికి పీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న మహ్మద్ హబిబుల్లాఖాన్ను వీఆర్‌కు అటాచ్ చేశారు. మాదాపూర్ సీసీఎస్‌లో (Madhapur CCS) పని చేస్తున్న బి.సంజీవులును శంషాబాద్ ఎయిర్‌పోర్టు స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు. మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్‌లో (Madhapur Traffic PS) పని చేస్తున్న బి.సత్యనారాయణ మారేడ్‌పల్లికి బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న పి.నరేందర్ సైబరాబాద్ ఎకానమిక్ అఫెన్స్ వింగ్‌కు వెళ్లారు.
కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో (Traffic Police Station) పని చేస్తున్న ముత్తు యాదవ్ రాజేంద్రనగర్‌కు, అల్వాల్ పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న తిమ్మప్ప కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్‌కు బదిలీ అయ్యారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో (Madhapur DCP Office) పని చేస్తున్న వీరబాబు అల్వాల్‌కు, శంషాబాద్ జోన్ స్పెషల్ బ్రాంచ్‌లో ఉన్న నాగేంద్రబాబు మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు.