Teachers Training | రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

అక్షరటుడే, బాన్సువాడ: Teachers Training | బాన్సువాడ డివిజన్ (Banswada Division) పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పట్టణంలో మంగళవారం నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగేశ్వరరావు (MEO Nageswara Rao) తెలిపారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులకు, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయులకు (Bioscience Teachers), ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులకు, జడ్పీహెచ్​ఎస్​ కోన బాన్సువాడ పాఠశాలలో ఫిజికల్​ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు (Physical Education Teachers) శిక్షణ నిర్వహించనున్నట్లు […]

అక్షరటుడే, బాన్సువాడ: Teachers Training | బాన్సువాడ డివిజన్ (Banswada Division) పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పట్టణంలో మంగళవారం నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగేశ్వరరావు (MEO Nageswara Rao) తెలిపారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులకు, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయులకు (Bioscience Teachers), ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులకు, జడ్పీహెచ్​ఎస్​ కోన బాన్సువాడ పాఠశాలలో ఫిజికల్​ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు (Physical Education Teachers) శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ మండలం ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు జడ్పీహెచ్ఎస్ బోర్లం పాఠశాలలో మండల స్థాయి శిక్షణ నిర్వహించినట్లు చెప్పారు.

ఆర్మూర్, బోధన్​లలో..​

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్​ మండలం, బోధన్​ అర్బన్​, రూరల్​ పరిధుల్లో ఉపాధ్యాయులకు ఈనెల 24 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆర్మూర్ ఎంఈవో రాజా గంగారాం (Armoor MEO Raja Gangaram), బోధన్​ ఎంఈవో నాగయ్య తెలిపారు. ఆర్మూర్ రామ్​మందిర్​ పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్​పై, బోధన్​లోని ఇందూరు బీఈడీ కళాశాల, ఆచన్​పల్లిలో శిక్షణా ఉంటుందని వివరించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...