అక్షరటుడే, కామారెడ్డి: Training to Sarpanches | ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat elections) ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలలో పాలకవర్గాలు కూడా కొలువయ్యాయి. దాంతో ప్రభుత్వం మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు (Sarpanches) శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్త సర్పంచులకు బాధ్యతలు, వారి విధి విధానాలు, ఇతర అంశాలను శిక్షణ కార్యక్రమాల్లో అధికారులు వివరించనున్నారు.
Training to Sarpanches | 532 సర్పంచ్లకు..
జిల్లాలోని 532 మంది సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు విడతల వారీగా 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు శిక్షణ నిర్వహించబోయే తేదీలు జిల్లా పంచాయతీ అధికారి మురళి (District Panchayat Officer Murali) ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని (Government Degree College) రూసా భవనంలోని రెండు హాళ్లలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి హాల్లో లింగంపేట మండలంలోని 41 మంది సర్పంచులు, దోమకొండ మండలంలోని 9 మంది, రెండవ హాలులో బాన్సువాడ మండలంలోని 25 మంది, మహమ్మద్ నగర్ మండలంలోని 13 మంది, భిక్కనూరు మండలంలోని 18 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.
Training to Sarpanches | ఫిబ్రవరి 3 నుంచి 7 వ తేదీ వరకు..
ఫిబ్రవరి 3 నుంచి 7 వ తేదీ వరకు మొదటి హాల్లో సదాశివనగర్ మండలంలోని 45 మంది, బీర్కూర్ మండలంలోని 13 మంది, కామారెడ్డి మండలంలోని 14 మంది, రెండవ హాలులో రామారెడ్డి మండలంలోని 18 మంది, రాజంపేట మండలంలోని 18 మంది, తాడ్వాయి మండలంలోని 18 మంది సర్పంచులకు శిక్షణ ఏర్పాటు చేశారు.
Training to Sarpanches | ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు..
ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు మొదటి హాల్లో గాంధారి మండలంలోని 45 మంది బీబీపేట మండలంలోని 11 మంది, నాగిరెడ్డిపేట మండలంలోని 27 మంది, పాల్వంచ మండలంలోని 12 మంది, నిజాంసాగర్ మండలంలోని 14 మంది సర్పంచులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి హాలులో ఎల్లారెడ్డి మండలంలోని 31 మంది, మాచారెడ్డి మండలంలోని 25 మంది, రెండవ హాల్లో బిచ్కుంద మండలంలోని 23 మంది, జుక్కల్ మండలంలోని 30 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.
Training to Sarpanches | ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు..
ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు మొదటి హాల్లో మద్నూర్ మండలంలోని 21మంది, డోంగ్లీ మండలంలోని 13 మంది, నస్రుల్లాబాద్ మండలంలోని 19 మంది, పిట్లం మండలంలోని 26 మంది, పెద్ద కొడప్గల్ మండలంలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్లో 106 మంది, రెండో బ్యాచ్లో 105 మంది, మూడో బ్యాచ్లో 109 మంది, నాలుగో బ్యాచ్లో 109 మంది, ఐదో బ్యాచ్లో 103 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో సర్పంచులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.