అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Railway Police | రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు.. శనివారం తనతో పాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐడీ పార్టీ పోలీసులు హనుమాన్ గౌడ్, సురేందర్, గురుదాస్ కలిసి మేడ్చల్ రైల్వేస్టేషన్‌కు (Medchal railway station) వెళ్లి పాత నేరస్థుడిపై నిఘా వేశామన్నారు.
అక్కడికి వచ్చిన పాత నేరస్థుడు మంచిర్యాల్‌కు చెందిన షేక్ యూనుస్‌ను అదుపులోకి తీసుకుని నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు (Railway Police Station) తరలించామన్నారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకుని అతడిని కోర్టుకు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు.