Suryapet District | క‌సాయి తండ్రి.. ఏడుస్తుంద‌ని చిన్నారిని నెలకేసి కొట్టాడు.. చివ‌రికి ఏమైందంటే..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suryapet District | తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో (Suryapet district  Center) కన్నతండ్రే రాక్షసంగా మారిన దారుణ ఘటన ఒక్కసారిగా స్థానికులను శోక సంద్రంలో ముంచేసింది. మద్యం మత్తులో కుమార్తెపై పాశవికంగా దాడి చేసిన తండ్రి (Father) చేతిలో 12 నెలల పసిపాప బలైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాగారం మండలం డి. కొత్తపల్లికి చెందిన గైగుల్ల వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల పాప భవిజ్ఞ. వారు ప్రస్తుతం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suryapet District | తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో (Suryapet district  Center) కన్నతండ్రే రాక్షసంగా మారిన దారుణ ఘటన ఒక్కసారిగా స్థానికులను శోక సంద్రంలో ముంచేసింది. మద్యం మత్తులో కుమార్తెపై పాశవికంగా దాడి చేసిన తండ్రి (Father) చేతిలో 12 నెలల పసిపాప బలైంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాగారం మండలం డి. కొత్తపల్లికి చెందిన గైగుల్ల వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల పాప భవిజ్ఞ. వారు ప్రస్తుతం సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో (Priyanka colony) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఇంటికి చేరాడు. భార్య నాగమణితో తీవ్ర వాగ్వాదం జరిగింది.

Suryapet District | కోపంతో ఎంత ప‌ని చేశాడు..

తల్లిదండ్రుల గొడవ మధ్యలో చిన్నారి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో మానవత్వం మరచిన వెంకటేశ్వర్లు పాపపై రాక్షసంగా ప్రవర్తించాడు. చిన్నారి కాళ్లు పట్టుకొని నేలకేసి బలంగా కొట్టాడు. ఈ దాడిలో భవిజ్ఞకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి గాయాలు తీవ్రమవడంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆస్పత్రికి (local hospital) తరలించారు.

కానీ అప్పటికే చిన్నారి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. తలకు మరియు శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో భవిజ్ఞ చికిత్స పొందుతూనే మరణించింది. చిన్నారి మృతితో కుటుంబం (Family)  శోక‌సంద్రంలో మునిగింది. భర్త చేతిలో తన పసికందు మృత్యువాతపడటాన్ని తల్లి నాగమణి తట్టుకోలేక గుండెలదిరేలా రోదించింది. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారి తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (police Case) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచి జరిగిన ఈ దారుణం పై సంఘీభావంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేలా సమాజం ఒక్కటై నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల భద్రత కోసం చట్టాలు కఠినంగా అమలు కావాలన్న డిమాండ్ జోరందుకుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...