HomeజాతీయంMadhya Pradesh | తీవ్ర విషాదం.. దుర్గ‌మ్మ నిమ‌జ్జనానికి వెళ్తూ 11 మంది దుర్మరణం

Madhya Pradesh | తీవ్ర విషాదం.. దుర్గ‌మ్మ నిమ‌జ్జనానికి వెళ్తూ 11 మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Madhya Pradesh | విజయదశమి సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏకంగా 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాదకర ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ Madhya Pradesh లోని ఖాండ్వా జిల్లా Khandwa district పంధానా తాలూకా అర్దాలా గ్రామం Ardala village సమీపంలో జరిగింది. ప్రతి ఏడాది గ్రామస్థులు విజయదశమి Vijayadashami సందర్భంగా నవరాత్రుల పూజల అనంతరం వేడుకగా తీసుకెళ్లి అమ్మవారి విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తుంటారు.

ఈ క్రమంలో భారీ సంఖ్యలో భక్తులు ట్రాక్టరు ఎక్కి విగ్రహంతో కలిసి నది వైపు ప్రయాణిస్తుండగా.. ట్రాలీ అదుపు తప్పి నీటిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

Madhya Pradesh | అదుపు త‌ప్పి..

ప్రమాద సమయంలో ట్రాక్టరులో Tractor 20 నుంచి 25 మంది వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి పొక్లెయిన్​ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 11 మందిని రక్షించగలిగారు. మిగతా వారిలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం.

మరి కొంత మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, రెస్క్యూ బృందాల ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతుల్లో ఎక్కువగా యువకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ MohanYadav తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ విషాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆవేద‌న కలిగిస్తోంది. ఏకంగా 11 మంది కన్నుమూయ‌డంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.