ePaper
More
    HomeతెలంగాణDevotee collapses while dancing | వినాయక శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భక్తుడు

    Devotee collapses while dancing | వినాయక శోభాయాత్రలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భక్తుడు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Devotee collapses while dancing : వివాహాలు, శుభకార్యాలు, ఊరేగింపులు.. వేడుక ఏదైనా DJ సౌండ్ సిస్టమ్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది.

    కానీ, ఇది కొన్ని చోట్ల విషాదాంతంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. DJను బిగ్గరగా ప్లే చేస్తుండటంతో గుండెపోటు, ఇతర సమస్యలతో చాలా మంది అసువులు బాస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఘటన వెలుగుచూసింది.

    Devotee collapses while dancing : శోభాయాత్రలో అపశృతి..

    నారాయణపేట జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఆపశృతి జరిగింది.

    నిమజ్జనం సందర్భంగా గణనాథుడి శోభాయాత్రలో గణేశ్​ ఉత్సవ సమితి డీజే సంగీతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శేఖర్ అనే వ్యక్తి డాన్స్ చేస్తున్నాడు. కాగా, డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

    గమనించిన ఇతర భక్తులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడికి వెంటనే సీపీఆర్ చేశారు. ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.

    దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు.

    More like this

    Ganesh Immersion | నిమజ్జనంలో అపశృతి.. వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వినాయక నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. శనివారం...

    AP Liquor Case | లిక్క‌ర్ కేసు నిందితుల విడుద‌ల‌పై హైడ్రామా.. రిలీజ్ చేయ‌డంలో తాత్సారం.. ఉత్కంఠ రేపిన ప‌రిణామాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Liquor Case | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case)...

    Gadwal MLA | నేను బీఆర్​ఎస్​లోనే ఉన్నా : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal MLA | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. ఇటీవల సుప్రీం కోర్టు...