Homeక్రైంBasara | బాసరలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara | బాసరలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Basara | నిర్మల్ (Nirmal)​ జిల్లా బాసర (Basara)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (Godavari) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు.

హైదరాబాద్​ (Hyderabad)లోని చింతల్​కు చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ఆదివారం బాసర క్షేత్రానికి వచ్చారు. ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మేటల వద్ద స్నానాలు చేస్తుండగా.. ఐదుగురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ఇందులో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరొకరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. మృతులు రాకేశ్​, వినోద్​, రుతిక్​, మదన్​గా గుర్తించారు. మృతదేహాలను భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.