అక్షరటుడే, ఆర్మూర్ : Traffic Rules | ప్రతిఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ అన్నారు. జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్, వాహనదారులు పాల్గొన్నారు.
Traffic Rules | అతివేగం వద్దు… ప్రాణాలు ముద్దు..
అక్షరటుడే బాల్కొండ : ప్రయాణికులు అతివేగంగా వాహనాలు నడుపుతూ.. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఆర్మూర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, సాగర్ సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని (Balkonda Mandal) కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో (Krishnaveni High School) విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే వాహనాలు నడపాలని, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Traffic Rules | హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు..
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించాలని ఏఎంవీఐ తెలిపారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు బాల్కొండలోని శివాజీ సర్కిల్ (Shivaji Circle) నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రత నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విగ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయకర్తన్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
