అక్షరటుడే, ఆర్మూర్ : Traffic Rules | వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్మూర్ మండల న్యాయ సేవాధికార సంఘం, రోడ్డు రవాణా శాఖ (Road Transport Department), పోలీస్ శాఖ (Police Department) సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
Traffic Rules | ఆర్మూర్ కోట్టు నుంచి..
ఆర్మూర్ కోర్టు (Armoor Court) ఆవరణ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్ వరకు నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ.. ప్రమాదాలను నివారించాలన్నారు. అనంతరం బస్టాండ్లోని ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ భవ్యశ్రీ, ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్, ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రఘుపతి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, న్యాయవాదులు, పోలీస్, ఎంవీఐ సిబ్బంది పాల్గొన్నారు.