అక్షరటుడే, వెబ్డెస్క్ : Mussoorie | ట్రాఫిక్ జామ్తో సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్లలేక ఓ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ముస్సోరీ (Mussoorie)లో చోటు చేసుకుంది.
ఢిల్లీకి చెందిన కమల్ కిషోర్ టాండన్(62) జూన్ 5న తన కుటుంబంతో కలిసి ముస్సోరీకి వచ్చాడు. మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. వాతావరణంలో మార్పు, వర్షాల కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు కమల్ కిషోర్ మేనల్లుడు అర్జున్ కపూర్ తెలిపారు.
అయితే వెంటనే ఆయనను సమీపంలోని లాండోర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ముస్సోరీలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కావడంతో ఆయన సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక మృతి చెందాడు.