Traffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి జిల్లా(Rangareddy district) పెద్దఅంబర్ పేట్(Pedda Amberpet) ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధి సర్వీస్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన రమావత్ మాన్ సింగ్(38) యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​(Yadagirigutta Traffic Police Station)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరే గురువారం డ్యూటీ ముగించుకొని ఇంటికి […]

అక్షరటుడే, హైదరాబాద్: Traffic constable : టిప్పర్ డ్రైవర్ నిర్లక్షానికి ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్ అసువులు బాసాడు. రంగారెడ్డి జిల్లా(Rangareddy district) పెద్దఅంబర్ పేట్(Pedda Amberpet) ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధి సర్వీస్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడకు చెందిన రమావత్ మాన్ సింగ్(38) యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​(Yadagirigutta Traffic Police Station)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరే గురువారం డ్యూటీ ముగించుకొని ఇంటికి బైక్ పై బయలుదేరారు.

పెద్దఅంబర్ పేట్ కు రాగానే మాన్ సింగ్ ముందర వెళ్తున్న టిప్పర్ సడెన్ బ్రేక్​ వేయడంతో ఆగింది. ఊహించని ఈ పరిణామానికి మాన్ సింగ్ టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీ కొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై కానిస్టేబుల్ మాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్​ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...