అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | పొలం నాట్లు వేసేందుకు ట్రాక్టర్ కేజ్‌వీల్‌తో చదును చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం మిషన్ పల్లి గ్రామంలో (Mission Palli Village) శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
మిషన్ పల్లి గ్రామానికి చెందిన బోండ్ల శ్రీను అనే రైతు (Farmers) తన పొలంలో సొంత ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌తో దున్నుతున్న సమయంలో ట్రాక్టర్‌పై నుంచి పడి మట్టిలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ పొలంలో తిరుగుతుందని రహదారి వెంట వెళ్లే స్థానికులు చూసి పరిశీలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.