అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఇటీవలే మొదటి విడత జనహిత పాదయాత్ర విజయవంతంగా ముగించారు. మరో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
ఈ నెల (ఆగస్టు) 24వ తేదీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేపడుతున్నట్లు ప్రకటించారు.
Janahita Padayatra : ఆరంభం ఇక్కడి నుంచే..
ఆగస్టు 24వ తేదీన చొప్పదండి నియోజకవర్గం(Choppadandi constituency)లో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది.
మరుసటి రోజు అంటే.. 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం చేపడతారు. ఉదయం 10.30 గంటలకు నుంచి కరీంనగర్ జిల్లా(Karimnagar district) కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తారు.
అదే రోజు అంటే.. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గం(Vardhannapet constituency)లో జనహిత పాదయాత్ర చేపడతారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
మళ్లీ 26వ తేదీన ఉదయం 7 నుంచి 9 గంటల వరకు యథావిధిగా శ్రమదానం చేపడతారు. అదే రోజు ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా (Warangal district) కార్యకర్తల సమ్మేళనం ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills constituency) కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు.