అక్షరటుడే, ఇందూరు: TPCC Chief Mahesh Kumar | ధర్మపురి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీఎస్ గురించి మాట్లాడారు. డీ శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
TPCC Chief Mahesh Kumar |
రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. 75 శాతం బీసీ, ఎస్టీ, ఎస్టీలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సామాజికవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ధర్మపురి సంజయ్ నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది.
