Homeజిల్లాలునిజామాబాద్​Sriramsagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి

Sriramsagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి

అక్షరటుడే, మెండోరా: Sriramsagar | దసరా సెలవులు రావడం.. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు గేట్లు సైతం ఎత్తడంతో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లా నలువైపుల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.

అలాగే మహారాష్ట్ర (Maharashtra), నాందేడ్ (Nanded)​, నిర్మల్​ జిల్లాల నుంచి సైతం ప్రజలు ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు. గేట్ల నుంచి విడుదలవుతున్న చూస్తూ సేదదీరారు. ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ ఉల్లాసంగా గడిపారు.

Sriramsagar | వ్యాపారులకు పండుగ

ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలిరావడంతో వ్యాపారస్తులకు పండుగలా మారింది. ప్రాజెక్టుపై వివిధ రకాల తినుబండారాల దుకాణాలు వెలిశాయి. అలాగే గుర్రపుస్వారీ సైతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పోలీసులు సైతం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Must Read
Related News