అక్షరటుడే, మెండోరా : Mendora | మెండోరా మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీజీఆర్ఎఫ్ ఛైర్పర్సన్ నారాయణ (CGRF Chairperson Narayana) తెలిపారు.
ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. మండలంలోని సబ్స్టేషన్ సెక్షన్ కార్యాలయంలో (Substation Section Office) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సమస్యలపై పరిష్కార కార్యక్రమం ఉంటుందని వారు పేర్కొన్నారు.
Mendora | ఆయా మండలాల్లో..
పెర్కిట్, బాల్కొండ, మొప్కాల్, మెండోరా మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు (Electricity Consumers) ఈ వేదికలో తమ సమస్యలను ప్రత్యక్షంగా తెలియజేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీజీఆర్ఎఫ్–2 ఛైర్పర్సన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ శాలాంధ్ర రామకృష్ణ, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ లకావత్ కిషన్, సీజీఆర్ఎఫ్–4 మెంబర్ మర్రిపల్లి రాజగౌడ్, ఆర్మూర్ డీఈపీవీ రాజేశ్వర్ రావ్, పెర్కిట్ ఏడీఈ శ్రీనివాస్, పెర్కిట్ ఈఆర్వో ఏఏవో (ERO AAO) మోహన్, మెండోరా ఏఈ అంజాద్ పాషా, ముప్కాల్ ఏఏఈ AAE శ్రీనివాస్, పెర్కిట్ ఏఈ AE మౌనిక, బాల్కొండ ఏఏఈ (AAE) కిషన్ పాల్గొననున్నారు.