అక్షరటుడే, ఆర్మూర్: Alai balai | పట్టణంలోని క్షత్రీయ ఫంక్షన్ హాల్లో (Kshatriya Function Hall) ఆదివారం ఆర్మూర్ పట్టణ పద్మశాలీల అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణ పద్మశాలి సంఘం (Padmashaali Pattana Sangham) అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఈఆర్ ఫౌండేషన్ (ER Foundation) ఛైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ (Chartered Accountant) ఈరవత్రి రాజశేఖర్‌ను కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఫౌండేషన్ తరపున అన్నదానం కార్యక్రమానికి ముందుకు రావడంపై సంఘం సభ్యులు రాజశేఖర్‌ను అభినందించారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కొక్కుల రమాకాంత్, ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ సంఘ సభ్యులు ఐడియా సాగర్, పట్టణ రెండో సంఘం అధ్యక్షుడు బండి అనంత రావు, ఎల్ఐసీ భాస్కర్, ప్రభాకర్ పాల్గొన్నారు.