Tollywood Industry | ప‌వ‌నా, మ‌జాకానా.. చంద్ర‌బాబును క‌లిసేందుకు క‌దిలిన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Tollywood Industry | ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) తెలుగు సినిమా పరిశ్రమ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే కూట‌మి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా, సినీ పరిశ్రమ పెద్దలతో గానీ, ప్రభుత్వ అధికారులతో గానీ ఇప్పటివరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Tollywood Industry | ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) తెలుగు సినిమా పరిశ్రమ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

అయితే కూట‌మి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా, సినీ పరిశ్రమ పెద్దలతో గానీ, ప్రభుత్వ అధికారులతో గానీ ఇప్పటివరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ముఖ్యమంత్రితో అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tollywood Industry | చంద్ర‌బాబుతో భేటీ..

పవన్ వ్యాఖ్యలకు అల్లు అరవింద్, దిల్ రాజు Dil raju మద్దతు ప్రకటించారు. ఇక, ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను కలిసేందుకు నిర్ణయించారు. పవన్ సారధ్యంలోనే కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు కలవనున్నారు. త్వరలో జరగనున్న ఈ సమావేశం, సినీ పరిశ్రమ(film industry), ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష చర్చలకు వేదిక కానుంది.

ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల(Ticket Rates) నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. చాలాకాలంగా టాలీవుడ్‌కు Tollywood industry, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు అడ్డంకిగా మారిన వివాదాలకు ఈ సమావేశంతో ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకోనుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...