అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toll plaza staff attack | టోల్ రుసుం చెల్లింపు విషయంలో ఓ న్యాయవాదికి టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సదరు న్యాయవాదిపై టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ Uttar Pradesh లోని బరాబంకి జిల్లా Barabanki district , హైదర్‌గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Toll plaza staff attack | ట్రాఫిక్ జామ్.. టోల్ ఫ్రీ..
విషయం తెలుసుకున్న తోటి న్యాయవాదులు వందల సంఖ్యలో సదరు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. లక్నో-సుల్తాన్పూర్ నేషనల్ హైవే (NH-731) పై ఉన్న గోతౌనా బారా Gothana Bara టోల్ ప్లాజా Toll plaza వద్దకు భారీ న్యాయవాదులు తమ వాహనాలతో చేరుకుని ఆందోళనకు దిగారు.
పెద్ద ఎత్తున వాహనాల్లో న్యాయవాదులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా ట్రాఫిక్‌తో స్తంభించిపోయింది. దీంతో టోల్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు టోల్ ఫ్రీగా ఆ రహదారి కొనసాగింది. తోటి న్యాయవాది కోసం మిగతా న్యాయవాదులు సమష్టిగా పోరాడి విజయం సాధించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ఆదరణ పొందుతోంది.
కాగా, న్యాయవాదిపై దాడి ఘటన విషయంలో ముగ్గురు టోల్ ప్లాజా సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సదరు సిబ్బందికి శిక్ష పడే వరకు ఊరుకునేది లేదని న్యాయవాదులు పేర్కొన్నారు. అంతేకాకుండా వారి తరఫున ఏ న్యాయవాది కూడా వాదించ వద్దని తీర్మానించారు.