అక్షరటుడే, హైదరాబాద్: defense mock drill : డిఫెన్స్ మాక్ డ్రిల్ భారత్ సన్నద్ధం అవుతోంది. పహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉచ్చస్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో మే 7న (బుధవారం) దేశవ్యాప్తంగా సివిల్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సరిగ్గా 54 ఏళ్ల క్రితం అంటే 1971లో భారత్ - పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకంటే ముందు 1962లో భారత్ - చైనా యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు అసోంలో మాక్ డ్రిల్ జరిపారు.
హైదరాబాద్ Hyderabad లోని నాలుగు ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ ఉంటుంది. సికింద్రాబాద్, కంచన్ బాగ్ డీఆర్డీఓ, గోల్కొండ, మౌలాలి ఎన్ఎఫ్సీ(Secunderabad, Kanchan Bagh DRDO, Golconda, Maulali NFC) లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో అవగాహన కల్పిస్తారు.
ఔటర్ రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ సిటీ మొత్తం మాక్ డ్రిల్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నగరమంతటా అధికారులు సైరన్లు మోగిస్తారు. ఈ సైరన్ రెండు నిమిషాల పాటు మోగుతుంది. అన్ని కూడళ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో సైరన్లు మోగించనున్నారు.
బంజారాహిల్స్ Banjara Hills లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(Integrated Command and Control Center) నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. సైరన్ Sirens మోగగానే ప్రజలంతా బహిరంగ ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. సమాచారం కోసం టీవీ TV, రేడియో radio, ప్రభుత్వ యాప్‌లను వినియోగించుకోవాలి. ఇంట్లో ఉన్నవారు లైట్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్ స్టవ్ ఆపాలని అధికారులు సూచించారు.
సాయంత్రం 4:15 గంటలకు హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ అధికారులు ఆయా చోట్లకు చేరుకుంటారు. నాలుగున్నర కల్లా మాక్ డ్రిల్ పూర్తి చేస్తారు.