అక్షరటుడే, వెబ్డెస్క్ : Meenakshi Natarajan | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు తెలంగాణ (Telangana)కు రానున్నారు. వారం రోజుల పాటు ఆమె తెలంగాణలో ఉండనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియ సాగుతోంది. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ పర్యటిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలోని తాజా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ప్రకటించిన డీసీసీల నియామకంపై పార్టీలో గందరగోళం నెలకొంది. కొందరు డీసీసీ అధ్యక్షుల నియామకంపై వ్యతిరేకత ఉంది. నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చాలని ఇటీవల కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. డీసీసీల విషయంలో పలువురు స్థానిక నేతలు, సీనియర్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆమె నేతలతో భేటీ కానున్నారు. కొత్త, పాత డీసీసీలతో భేటీ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
Meenakshi Natarajan | రేపు గాంధీ భవన్కు సీఎం రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. గాంధీభవన్లో మంగళవారం జరిగే సమావేశంలో సీఎం సైతం పాల్గొననున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్ష జరపనున్నారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
