Homeతాజావార్తలుToday Horoscope | ఈ రాశివారు నేడు స్నేహితులతో జాగ్రత సుమా!

Today Horoscope | ఈ రాశివారు నేడు స్నేహితులతో జాగ్రత సుమా!

Today Horoscope | ఆర్థిక, కుటుంబ, వృత్తిపరమైన అంశాలలో రాశి ఫలాలు ఏమి చెబుతున్నాయి..? శుభ ఫలితాల కోసం ఏమి చేయాలో జ్యోతిష్య పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Horoscope | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా రాశుల వారికి ఈ రోజు (మంగళవారం, డిసెంబరు 2) మందికి విశ్రాంతి తీసుకోవడానికి, వ్యక్తిగత, ఆర్థిక జీవితాలలో సర్దుబాట్లు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన రోజు.

గ్రహాల గమనాన్ని బట్టి, కొందరు తమ పాత పెట్టుబడులు, కొత్త ఆదాయ ఆలోచనల ద్వారా ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది.

మరికొందరు మాత్రం ఖర్చులు నియంత్రించి పొదుపుపై దృష్టి సారించాలి. కొంతమందికి అలసట, నీరసం కనిపించినా, అతిగా శ్రమించకుండా ఆరోగ్యాన్ని, విశ్రాంతిని నిర్ధారించుకోవడం ముఖ్యం.

మేష రాశి: Today Horoscope | అదనంగా డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు ఉపయోగపడతాయి. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి, విశ్రాంతికి తక్కువ సమయం ఉంటుంది. మీరు ఒప్పుకొన్న నిర్మాణ పనులు, ఇతర పనులు సంతృప్తి మేరకు పూర్తవుతాయి.

వృషభ రాశి: Today Horoscope | మీ వద్ద ఉన్న ఎక్కువ మొత్తంలో డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టండి. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.

ఉద్యోగ విధుల పరంగా మంచిగా ఉంటుంది. సహోద్యోగులు, ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు.

మిథున రాశి: Today Horoscope | స్నేహితులతో, కొత్త వ్యక్తులతో ఒకే విధంగా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కోరికలకు అనుగుణంగా కెరియర్​ నిర్ణయాలు తీసుకోండి. అవి మంచి ఫలితాలు ఇస్తాయి. లీగల్​ విషయాలలో లాయర్‌ను కలిసి సలహా తీసుకోవడానికి మంచి రోజు.

కర్కాటక రాశి: Today Horoscope | మీకు బాగా దగ్గరైన వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల న్యాయస్థానం (కోర్టు) మెట్లు ఎక్కవలసి వచ్చి, కష్టపడి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పొరుగువారితో తగాదా మీ మూడ్‌ను పాడుచేస్తుంది. అభిప్రాయాలను వ్యక్త పరచడానికి, సృజనాత్మకతతో కూడిన ప్రాజెక్టుల గురించి పని చేయడానికి ఇది మంచి సమయం.

సింహ రాశి: ఇవాళ వ్యాపారంలో స్త్రీలు.. పురుషుల సహాయంతో, పురుషులు.. స్త్రీల సహాయంతో లాభాలను గడిస్తారు. కొత్త భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకునే ముందు వాస్తవాలను, వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం. విచ్చలవిడి ఖర్చుల వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

కన్యా రాశి: యువతను కలుపుకొనిపోయే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష భయం మిమ్మల్ని ఆవరించకుండా చూసుకోండి. మీ కష్టం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తులా రాశి: కొన్ని తప్పనిసరి పరిస్థితులు కొంత అసౌకర్యం కలిగించవచ్చు. కొత్తగా డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రవర్తన కొత్త స్నేహితులను సంపాదించడానికి సహాయపడతాయి. డబ్బు సంపాదనకు సంబంధించి తోచిన కొత్త ఆలోచనలను అమలు చేసి ప్రయోజనం పొందండి. ఇంట్లో శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు నిర్వహిస్తారు.

వృశ్చిక రాశి: ఇతర దేశాలలోని ఆస్తులలో (స్థలాలలో) పెట్టుబడి పెట్టి ఉంటే, అవి అమ్ముడుపోయి మంచి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబం కోసం కష్టపడి పని చేస్తారు.

ఇవాళ బాగా దగ్గరివారిని కలవడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ ప్రారంభం మీకు అలసటగా అనిపించవచ్చు. రోజు గడిచే కొద్దీ మంచి ఫలితాలను పొందుతారు.

ధనుస్సు రాశి: అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు. ప్రేమ జీవితం వివాహ ప్రస్తావనతో జీవిత కాల బంధంగా మారే అవకాశం ఉంది. ఆఫీసులో ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు స్వయం శక్తి ఎంతగానో సహాయపడుతుంది. ఇంట్లో చిన్నారి అనారోగ్యం ఆందోళనకు గురి చేస్తుంది.

మకర రాశి: ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల చాలా కాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లించడానికి వీలవుతుంది.

మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు తీసుకొస్తుంది. వివాదాలు, ఆఫీసు రాజకీయాల గురించి మర్చిపోండి. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది.

కుంభ రాశి: గతంలో భవిష్యత్తు అవసరాల కోసం చేసిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు అందుతాయి. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మిమ్మల్ని సెంటిమెంట్​గా మారుస్తాయి. అయినప్పటికీ, మీ భావనలను, మాటలను.. మిమ్మల్ని పట్టించుకునేవారితో పంచుకుంటారు.

మీన రాశి: ఏది ఉత్తమమో మీకు బాగా తెలుసు. కాబట్టి, ధైర్యంగా ఉంటారు. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితాలు ఏమైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇవాళ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. పనిలో సహోద్యోగులు, అసోసియేట్‌లు సహాయం చేస్తారు.

Must Read
Related News