అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ఇటీవల బంగారం ధరలు Gold Ratesపెట్టుబడిదారులు, వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం లక్షా 30 వేల మార్క్‌ను దాటి పరుగులు పెట్టిన పసిడి ధరలు ఆ తరువాత తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం విలువలు పడిపోవడంతో దేశీయంగా కూడా ఒక్కసారిగా గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఇటీవల మళ్లీ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పసిడి, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. ధరల్లో ఈ తరహా ఊగిసలాటలు ప్రపంచ మార్కెట్ మార్పులు, డాలర్ బలపడటం–బలహీనపడటం, క్రూడ్ ఆయిల్ మార్పులు వంటి కారణాల వల్ల తరచూ చోటుచేసుకుంటాయి.
Today Gold Prices | ధరలో వ్యత్యాసం..
శనివారంతో పోలిస్తే ఆదివారం Sunday (నవంబర్ 23, 2025) ధరలు స్థిరంగా కొనసాగాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి తాజా ధరలు (23 నవంబర్ 2025) ఎలా ఉన్నాయనేది చూస్తే.. బంగారం ధరలు 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు): ₹1,25,840గా నమోదు కాగా, 22 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు): ₹1,15,350గా ట్రేడ్ అయింది. ఇక వెండి కిలో ధర: ₹1,64,000గా ఉంది. తెలుగు రాష్ట్రాలు & ప్రధాన నగరాల్లో బంగారం–వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…హైదరాబాద్‌లో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర ₹1,25,840, 22 క్యారెట్లు ₹1,15,350, వెండి కిలో ₹1,72,000గా ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు ₹1,25,990, 22 క్యారెట్లు ₹1,15,500, వెండి కిలో ₹1,64,000గా ఉంది.
ముంబైలో Mumbai 24 క్యారెట్లు ₹1,25,840, 22 క్యారెట్లు ₹1,15,350, వెండి కిలో ₹1,64,000గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,26,880, 22 క్యారెట్లు ₹1,16,300, వెండి కిలో ₹1,72,000గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్లు ₹1,25,840, 22 క్యారెట్లు ₹1,15,350, వెండి కిలో ₹1,64,000గా ధరలు నమోదయ్యాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసాలు కనిపించడం సహజం. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్ల ప్రతి నగరంలో రేట్లు భిన్నంగా ఉంటాయి.
[7:32 AM, 11/23/2025] +91 90305 93918: 167
