Today Gold Prices | మ‌ళ్లీ రికార్డు స్థాయిలో బంగారం ధ‌ర‌.. తెలుగు రాష్ట్రాల‌లో పరిస్థితి ఏమిటంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో Silver Rates మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన‌ బంగారం ధరలు రెండు రోజులుగా మళ్లీ పెర‌గ‌డం మొద‌ల‌య్యాయ‌. ఒక రోజు త‌గ్గితే మరుసటి రోజు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా, నవంబరు 29, శ‌నివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 […]

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో Silver Rates మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన‌ బంగారం ధరలు రెండు రోజులుగా మళ్లీ పెర‌గ‌డం మొద‌ల‌య్యాయ‌. ఒక రోజు త‌గ్గితే మరుసటి రోజు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు.

తాజాగా, నవంబరు 29, శ‌నివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,17,760గా ఉంది. ఇక వెండిపై కూడా పెరుగుదల నమోదు అయింది. కిలో వెండి ధర రూ.1,83,100 వద్ద కొనసాగుతోంది.

గత రెండ్రోజులలో వెండి ధర ఏకంగా రూ.7,000 వరకు పెరగడం విశేషం. బంగారంలో కూడా రోజువారీ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే తులం బంగారం Gold పై రూ.700కు పైగా పెరుగుదల నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (నవంబరు 29) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

ఢిల్లీ

  • 24 క్యారెట్లు – రూ.1,28,620 (10 గ్రాములు)
  • 22 క్యారెట్లు – రూ.1,17,910 (10 గ్రాములు)

ముంబై

  • 24 క్యారెట్లు – రూ.1,28,470
  • 22 క్యారెట్లు – రూ.1,17,760

హైదరాబాద్ / విజయవాడ / బెంగళూరు

  • 24 క్యారెట్లు – రూ.1,28,470
  • 22 క్యారెట్లు – రూ.1,17,760

చెన్నై

  • 24 క్యారెట్లు – రూ.1,29,170
  • 22 క్యారెట్లు – రూ.1,18,410

Today Gold Prices | భారతదేశంలో బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు?

భారతదేశంలోIndia బంగారం ధరలు అనేక కీలక అంశాలపై ఆధారపడి ఉంటాయి:

  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర
  • దిగుమతి సుంకాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు
  • డాలర్–రూపాయి మారకం రేటు
  • దేశీయ డిమాండ్–సప్లై పరిస్థితి

వివాహాలు, పండుగలు Festivals వంటి సీజన్‌లలో బంగారంపై డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పెట్టుబడి, పొదుపు సాధనంగా కూడా భారతీయులు అధికంగా వినియోగిస్తారు.

బంగారం, వెండి ధరల్లో వచ్చే రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున కొనుగోలు చేయాలని భావించే వారు రోజువారీ రేట్లను పరిశీలించడం మంచిది

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...