అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు Gold Prices ఎలాంటి రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గినా, మరుసటి రోజు మళ్లీ పెరిగిపోవడం వల్ల వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో బంగారం ధరలు ప్రతీ రోజూ హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా డిసెంబర్ 8న 24 క్యారెట్ల (ప్యూర్ గోల్డ్) 10 గ్రాముల ధర రూ.1,30,140 వద్ద నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మధ్య ఈ భారీ ధరలు వినియోగదారులను మరింత భారంలోకి నెడుతున్నాయి.
Today Gold Prices | పరుగో పరుగు..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తు..
- హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్లు: రూ.1,30,140గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు: రూ.1,19,290గా నమోదైంది.
- ఇక విజయవాడలో 24 క్యారెట్లు: రూ.1,30,140గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు: రూ.1,19,290గా నమోదైంది.
- ఢిల్లీలో 24 క్యారెట్లు: రూ.1,30,290గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు: రూ.1,19,440గా నమోదైంది.
- ముంబైలో చూస్తే.. 24 క్యారెట్లు: రూ.1,30,140గా నమోదు కాగా, 22 క్యారెట్లు: రూ.1,19,290గా ట్రేడ్ అయింది.
బెంగళూరులో 24 క్యారెట్లు: రూ.1,30,140కాగా, 22 క్యారెట్లు: రూ.1,19,290గా ఉంది. ఇక కిలో వెండి ధర కూడా వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా రూ.1,89,900 ఉన్నట్లు సమాచారం. వెండి ధరలు కూడా బంగారం తరహాలోనే ఊగిసలాటకు గురవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులు, డాలర్ Dollar మారకపు విలువ, జియోపాలిటికల్ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. అదే సమయంలో, ఆయా రాష్ట్రాల GST, మేకింగ్ చార్జీలు, లోకల్ డిమాండ్ వంటి అంశాల వల్ల నగరానికో ధరలో స్వల్ప మార్పులు సహజం.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితిపై ఆందోళనలు, రూపాయి విలువ బలహీనత, వివాహ సీజన్ వల్ల దేశీయ డిమాండ్ పెరుగుదల.. ఈ పరిస్థితులన్నీ కలిసి బంగారం ధరలను మరింత ఎగబాకేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.