అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | ప్రపంచ ఆర్థిక పరిణామాలు తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తున్న సమయంలో దేశీయంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
డిసెంబర్ 2, 2025 నాటికి హైదరాబాద్, విజయవాడ, ముంబై, ఢిల్లీ, చెన్నైతో Chennai పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విలువైన లోహాల ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.
నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదు అయింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధర రూ.12,982 ఉండగా, నేడు రూ.13,049 కు చేరింది. అంటే రూ.67 పెరిగింది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ.11,900గా ఉండగా నేడు రూ.11,960కి చేరుకుంది. అంటే రూ.60 పెరుగుదల నమోదైంది.
Today Gold Prices | హెచ్చు తగ్గులు..
దేశవ్యాప్తంగా ధరలను పరిశీలిస్తే..
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,640 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,19,760 గా ఉంది.
- ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,490 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,610 గా కొనసాగుతోంది.
- చెన్నైలో మాత్రం ఈ ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్లకి రూ.1,31,680గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లకి రూ.1,20,710 గా నమోదయ్యాయి.
బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా పెరుగుదల కొనసాగుతుండగా ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,88,000 కు చేరుకుంది. గ్రాముకు వెండి ధర రూ.188 గా ఉంది. డిసెంబర్ నెల తొలి వారంలోనే బంగారం, వెండి ధరలు బలమైన పెరుగుదల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు, ద్రవ్యోల్బణ భయాలు వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం డిసెంబర్ నెలలో బంగారం ధరలు Gold Rates మరింత ఎగబాకే అవకాశం ఉంది. 10 గ్రాముల పసిడి ధర ఆల్ టైమ్ రికార్డును చేరుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలోనే రూ.1,35,000 మార్కును దాటే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పారిశ్రామిక రంగంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి విభాగాల్లో వెండికి భారీ డిమాండ్ పెరగడం వలన దాని ధర కూడా వరుసగా పెరుగుతోంది.
