అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | డిసెంబర్ నెల తొలి రోజైన (డిసెంబర్ 1, 2025) సోమవారం, దేశీయ బంగారం, వెండి మార్కెట్‌లు స్థిరంగా కొనసాగాయి. ఇటీవల ఆల్‌టైమ్ రికార్డుల దిశగా పరుగులు పెట్టిన పసిడి, Gold ఈరోజు ఎలాంటి మార్పులు లేకుండా ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రధాన నగరాల్లో ధరలు సమానంగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్.. ఈ మూడు నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి.
Today Gold Prices | స్థిరంగా ధరలు..
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ. 1,29,810గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ. 1,18,990గా ఉన్నాయి.
ఇక ఢిల్లీలో 24 క్యారెట్లు: రూ. 1,29,960గా నమోదు కాగా, 22 క్యారెట్లు: రూ. 1,19,140గా ట్రేడ్ అయింది.
ముంబైలో Mumbai 24 క్యారెట్లు: రూ. 1,29,810గా నమోదు కాగా, 22 క్యారెట్లు: రూ. 1,18,990గా ట్రేడ్ అయింది.
చెన్నైలో 24 క్యారెట్లు: రూ. 1,30,680, 22 క్యారెట్లు: రూ. 1,19,790
బెంగళూరులో 24 క్యారెట్లు: రూ. 1,29,810, 22 క్యారెట్లు: రూ. 1,18,990గా నమోదయ్యాయి.
ఇవి పన్నులు, తయారీ ఛార్జీలు లేకుండా ప్రకటించిన ప్రామాణిక ధరలు మాత్రమే. స్థానిక జువెలరీ షాపుల్లో ధరలు కొద్దిగా మారవచ్చు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుదల ధోరణిని కొనసాగిస్తున్నాయి. కిలో వెండి ధర: రూ. 1,84,000 కాగా, 1 గ్రాము వెండి ధర: రూ. 184గా ట్రేడ్ అయింది.
అయితే ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలు..
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు : అంతర్జాతీయంగా పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు : డిసెంబర్‌లో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడి, బంగారం ధరలు పెరుగుతాయి.
వెండిపై పారిశ్రామిక డిమాండ్ : సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వెండి వినియోగం పెరుగుతున్నందున, పారిశ్రామిక డిమాండ్ వెండి ధరలను పైకి నెడుతోంది.
మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం, డిసెంబర్ నెల మొత్తం బంగారం ధరల్లో Gold Rates మరింత పెరుగుదల ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,34,000 నుంచి రూ. 1,50,000 వరకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరల మార్పులను నిశితంగా గమనించి, సరైన సమయాన్ని ఎంచుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
