అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశీయ బంగారం, వెండి మార్కెట్లు భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితి, డాలర్ బలపడటం–బలహీనపడటం, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
దీంతో గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు రోజు రోజుకు హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. గురువారం పెరిగిన బంగారం ధరలు Gold Prices శుక్రవారం మళ్లీ స్వల్పంగా తగ్గాయి.
అయితే వెండి మాత్రం గురువారం రెండు లక్షల మార్క్‌ను తాకి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. శుక్రవారం మాత్రం వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.
Today Gold Prices | స్వల్ప తగ్గుదల..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (శుక్రవారం) చూస్తే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములు 1,29,650గా ట్రేడ్ కాగా (గురువారం: ₹1,29,660 — రూ.10 తగ్గుదల) , 22 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,18,840(గురువారం: ₹1,18,850)గా నమోదైంది.
- ఇక విజయవాడలో 24 క్యారెట్ ₹1,29,650గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ ₹1,18,840గా ట్రేడ్ అయింది.
- చెన్నైలో Chennai 24 క్యారెట్ – ₹1,31,120గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ – ₹1,20,190గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ – ₹1,29,650గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ – ₹1,18,840గా నమోదైంది.
- ఇక ఢిల్లీలో 24 క్యారెట్ – ₹1,29,800గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ – ₹1,18,990గా నమోదైంది.
ఇక వెండి ధరలు (కిలోకు) చూస్తే.. హైదరాబాద్‌లో Hyderabad ప్రస్తుత ధర – ₹1,99,900కాగా (గురువారం: ₹2,00,000 — రూ.100 తగ్గుదల), చెన్నైలో ₹1,99,900గా ట్రేడ్ అయింది. బెంగళూరులో ₹1,90,990, ఢిల్లీలో ₹1,90,900గా ఉంది.
అమెరికా వడ్డీ రేట్లపై ఊహాగానాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల రిస్క్ అవర్షన్, డాలర్ సూచీ మార్పులు వంటి అంశాలు బంగారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.
ఒకరోజు పెరిగిన ధరలు మరుసటి రోజు తగ్గిపోవడం వల్ల వినియోగదారులు, పెట్టుబడిదారులు గోల్డ్ కొనుగోలులో కొంత గందరగోళానికి గురవుతున్నారు.
బంగారం ధరలు అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో రూ.10–20 లోపు స్వల్పంగా తగ్గాయి. వెండి మాత్రం గురువారం రెండు లక్షల మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించినా, శుక్రవారం కొద్దిగా తగ్గింది.
