Homeతాజావార్తలుToday Gold Prices | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. తగ్గిన కొనుగోళ్లు..!

Today Gold Prices | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. తగ్గిన కొనుగోళ్లు..!

Today Gold Prices | ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో బంగారం–వెండి ధరలు పెరుగుతూ ఉండటం పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | ఈ రోజు బంగారం,వెండి ధరల్లో Silver Prices స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, అలాగే ఇన్వెస్టర్ల సేఫ్-హేవెన్ డిమాండ్‌ పెరగడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీ హెచ్చుతగ్గులు నమోదైనప్పటికీ, ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరుగుదల కొనసాగింది.

రానున్న రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డ్‌ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు నిపుణుల వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.

Today Gold Prices | హైదరాబాద్‌లో స్వల్ప పెరుగుదల

హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,590కు చేరుకుంది. నిన్నటి కంటే రూ.10 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.1,19,710గా నమోదైంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,400గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,533గా ఉంది. ధరలు కొద్దిగా పెరగడం నమోదు అయినప్పటికీ, మొత్తం మీద మార్కెట్ స్థిరంగా కనిపించింది.

ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,740 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,860గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఢిల్లీలో ఎక్కువగా ప్రతిఫలించింది.

దక్షిణాది నగరాల్లో చెన్నై ధరలు అత్యధికంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,580గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,20,610గా నమోదైంది. ఇతర నగరాలతో పోల్చితే చెన్నైలో ధరలు కొంచెం ఎక్కువగా కొనసాగుతుండటం గమనార్హం.

బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590గా ఉంది. 22 క్యారెట్ల ధర సుమారు రూ.1,19,100 పరిధిలోనే కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండిలో కూడా ఇవాళ స్వల్పంగా పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్‌లో వెండి గ్రాము ధర రూ.201.10గా ఉండగా, కిలో ధర రూ.2,01,100కు చేరుకుంది. నిన్నటి కంటే రూ.100 పెరుగుదల పెరిగింది. విజయవాడలో కూడా వెండి ధర కిలోకు రూ.2,01,100గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,91,100గా ఉంది. చెన్నైలో కూడా పెరుగుదల నమోదు కాగా, కిలో వెండి ధర రూ.2,01,100కి చేరింది.బెంగళూరులో కిలో వెండి ధర రూ.1,91,100గా ఉంది, నిన్నటి కంటే రూ.100 పెరిగింది.

Must Read
Related News