అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర వైపు దూసుకెళ్తూ, రూ. లక్షా 30 వేల మార్క్ చేరువలో ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices క్రమంగా పెరుగుతూ సాధారణ ప్రజలకు అందనంత దూరంగా వెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ఆస్తిగా మారింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర లక్షన్నర వైపు దూసుకెళ్తోంది.
తులం ధర ఇప్పుడు రూ. లక్షా 30 వేలకు చేరువలో ఉండగా, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం Friday పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది.
తాజాగా అక్టోబర్ 17న దేశీయంగా బంగారం ధర రూ.20 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గి రూ.1,18,640కు చేరింది.
Today Gold Prices | కాస్త ఉపశమనం..
వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,88,900గా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో వెండి ధర రూ.2,05,900గా ఉంది.
దీంతో వెండి కూడా తగ్గేదేలే అనిపించేలా రూ.2 లక్షల మార్కును దాటి రికార్డు సృష్టించింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెద్దగా తేడా లేకుండా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,29,580గా ఉండగా, చెన్నైలో రూ.1,29,830కు చేరింది.
హైదరాబాద్, ముంబయి Mumbai, విజయవాడ, బెంగళూరు Bangalore నగరాల్లో 24 క్యారెట్ల (24 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) ధర రూ.1,18,640గా ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరుగుతాయని అంచనా.
ఇప్పటికే ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల మార్కును దాటగా, దేశీయంగా రూ.1.30 లక్షల స్థాయిని అధిగమించింది. ఈ ధోరణి కొనసాగితే 2028 చివరి నాటికి లేదా 2029 ఆరంభంలో ఔన్సు బంగారం ధర 10 వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయానికి భారత్‌లో బంగారం ధర రూ.3 లక్షల మార్క్‌ను దాటవచ్చని అంచనా వేస్తున్నారు.