ePaper
More
    HomeతెలంగాణToday gold price | ప‌సిడి ప్రియుల‌కు కాస్త ఊర‌ట‌.. నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు

    Today gold price | ప‌సిడి ప్రియుల‌కు కాస్త ఊర‌ట‌.. నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | బంగారం ధ‌ర‌లు (gold rates) ఎప్పుడు ఎలా మారుతున్నాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక‌సారి త‌గ్గుద‌ల‌, మ‌రోసారి పెరుగుద‌ల‌తో ఎవ‌రికి ఏం అర్ధం కావ‌డం లేదు. ఆదివారం(18 మే) మాత్రం ఎటువంటి మార్పును నమోదు చేయలేదు. అంటే, దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయన్నమాట. భారత మార్కెట్లో(india markets) బంగారం ధరలు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 10 గ్రాములకు రికార్డు స్థాయిలో లక్ష రూపాయలను తాకిన ఈ పసుపు లోహం.. ఇప్పుడు దాదాపు రూ.95,000కి పడిపోయింది. అంటే కొద్దిరోజుల్లోనే బంగారం ధర రూ.5,000ల వరకు తగ్గిపోయింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం (global trade war) తగ్గుముఖం పట్టడం, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గడం వల్ల మార్కెట్ విశ్లేషకులు ఈ పతనానికి కారణమని చెబుతున్నారు.

    Today gold price | మార్పు లేదు..

    నిన్న హైదరాబాద్ నగరంలో (hyderabad city) 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర (20 carat gold price) రూ.95,130 దగ్గర ట్రేడ్ కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.71,350 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18, 22, 24 క్యారెట్ల బంగారం ధరలు పెరగలేదు.. తగ్గలేదు. నిన్నటిలాగే 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు కూడా రూ. 95,130 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.71,350 దగ్గర ట్రేడ్ అవుతోంది.

    ఇక వెండి (silver) విష‌యానికి వ‌స్తే.. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర రూ.10,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములు, కేజీ వెండి ధరల్లో (silver price) ఎలాంటి మార్పు లేదు. నిన్నటిలాగే ఈ రోజు కూడా 100 గ్రాముల వెండి ధర రూ.10,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర రూ.1,08,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. 2024, 2025 ప్రారంభంలో బంగారంలో కనిపించిన అద్భుతమైన రాబడి సమీప భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...