GOLD Price | మ‌హిళ‌లకి షాకిచ్చే న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌

Akshara Today: GOLD Price : బంగారం Gold price ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టే త‌గ్గి క్ర‌మేపి పెరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పండ‌గ‌లు, పెళ్లిళ్ల సీజ‌న్స్‌లో బంగారం కొనాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అలాంటి వారికి కోలుకోలేని షాక్‌లు ఇస్తుంది బంగారం ధర. గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు […]

Akshara Today: GOLD Price : బంగారం Gold price ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టే త‌గ్గి క్ర‌మేపి పెరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పండ‌గ‌లు, పెళ్లిళ్ల సీజ‌న్స్‌లో బంగారం కొనాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అలాంటి వారికి కోలుకోలేని షాక్‌లు ఇస్తుంది బంగారం ధర.

గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు today gold rates చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,574లు కాగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర  రూ.8,776లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర రూ.7,181లుగా ఉంది.

GOLD Price : ధ‌ర‌లు ఇలా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. ఢిల్లీలో Delhi 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర తులం రూ.87,910, 24 క్యారెట్ల ధర రూ.95,890గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల రేటు రూ.95,740గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,760, 24 క్యారెట్ల ధర రూ.95,740గా ఉంది.

గత కొన్ని రోజులుగా బంగారంతో పాటుగా వెండి Silverకి కూడా ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. అందకు తగ్గట్టు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్‌ నగల కోసం మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున వినియోగించడంతో డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కిలో వెండి ధర రూ.1,08,900లుగా ఉంది. హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,07,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,900, ముంబైలో రూ.96,900, బెంగళూరులో రూ.96,900, చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...