అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch elections | సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓ వ్యక్తి ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎంతో మంది ఎస్సై కొలువు కోసం కలలు కంటుంటే.. ఆయన మాత్రం సర్పంచ్ పదవి కోసం దానిని వదులుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో (Suryapet district) చోటు చేసుకుంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి నెలకొంది. మొదటి దశ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా పూర్తి అయింది. రేపటి నుంచి రెండో దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. కోదాడ ఎస్సై పులి వెంకటేశ్వర్లు (Kodada SI Puli Venkateswarlu) సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఇంకా 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
Sarpanch elections | గుడిబండ నుంచి పోటీకి
ఎస్సై వెంకటేశ్వర్లు స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ. అక్కడి నుంచి సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆయన భావించారు. ప్రభుత్వ ఉద్యోగి (government employee) ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. దీంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 5 నెలలే సర్వీస్ ఉండటంతో స్వచ్ఛంద విరమణ చేసి స్వగ్రామంలో పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. మరి ప్రజలు ఆయనను గెలిపిస్తారో లేదో చూడాలి. కాగా గ్రామంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
