అక్షరటుడే, ఇందూరు: TNGOs Nizamabad | ఉద్యోగుల సమస్యల (employee issues) పరిష్కారానికి టీఎన్జీవోస్ కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయశాఖలో ఉద్యోగులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం (membership registration program) నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన వ్యవసాయ శాఖ ఉద్యోగి ఫణి కళ్యాణ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
అనంతరం ఉద్యోగులకు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ 2025–26కు గాను ఉద్యోగులకు సభ్యత్వాలను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవోస్ ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
