50
అక్షరటుడే, భీమ్గల్: TNGOS Bheemgal | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ నిరంతరం కృషి చేస్తోందని భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ (Bheemgal Municipal Commissioner) గోపు గంగాధర్, తహశీల్దార్ షబ్బీర్ అన్నారు. సోమవారం భీమ్గల్ పట్టణంలో టీఎన్జీవో క్యాలెండర్లను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న భీమ్గల్ యూనిట్ కార్యవర్గాన్ని అభినందించారు. యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సహాధ్యక్షుడు కుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పురస్తు నరేష్, ఎడెల్లి రవి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రాకేష్, శృతి వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.