Homeజిల్లాలునిజామాబాద్​TNGOS Armoor | ఉద్యోగుల ఉన్నతే టీఎన్జీవోస్​ లక్ష్యం

TNGOS Armoor | ఉద్యోగుల ఉన్నతే టీఎన్జీవోస్​ లక్ష్యం

ఉద్యోగుల ఉన్నతే లక్ష్యంగా టీఎన్జీవోస్​ పనిచేస్తోందని టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ పేర్కొన్నారు. ఆర్మూర్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : TNGOS Armoor | ఉద్యోగుల ఉన్నతే టీఎన్జీవోస్​ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ పేర్కొన్నారు. టీఎన్జీవోస్​ ఆర్మూర్ (TNGOS Armoor) యూనిట్ అధ్యక్షుడు కె.శశికాంత్ రెడ్డి, యూనిట్ కార్యదర్శి విశాల్ అధ్యక్షతన గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ హాజరై సభ్యత్వాన్ని (TNGOs Membership) ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా సుమన్​కుమార్ మాట్లాడుతూ.. టీఎన్జీవో సంఘం ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేసి.. ప్రతి ప్రాథమిక సభ్యుడు సన్మానం కోసం కాకుండా సమస్యల అర్జీలతో టీఎన్జీవోస్​ కార్యాలయానికి (TNGOs Office) రావాలని తెలియజేశారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని రానున్నారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు, టీఎన్జీవోస్​ నాయకులు (TNGOs Leaders) మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్​ కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అతీక్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి విశాల్ రెడ్డి, వెల్ఫేర్ శాఖ జిల్లా అధ్యక్షుడు సురేష్, ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ, భీమ్​గల్​ యూనిట్లలో..

అక్షరటుడే, మెండోరా: టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎస్సారెస్పీ, భీమ్​గల్​ టీఎన్జీవోస్​ యూనిట్లలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి నేతికుంట శేఖర్​ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.