అక్షరటుడే, ఇందూరు: TNGOs Nizamabad | తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) మొదటిసారి నిజామాబాద్ కలెక్టరేట్‌కు శనివారం మొదటిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో టీఎన్జీవో ప్రతినిధులు సుదర్శన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సన్మానించి పూలబొకేతో సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షుడు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాశ్, స్వామి, శ్రీవేణి, టీఎన్జీవో సలహాదారు వనమాల సుధాకర్, వివిధ శాఖల ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.
