అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే నేరుగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
