అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగుస్తుందన్నారు.
Local Body Elections | గడువు దాటిన తర్వాత ప్రచారం నిషేధం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 5 తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో రెండు అంతర్జిల్లా చెక్ పోస్టులు, 2 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి సాయంత్రం నుంచి ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మద్యం విక్రయాలు చేపట్టవద్దన్నారు.
Local Body Elections | 50 లిక్కర్ కేసులు నమోదు..
జిల్లాలో ఇప్పటివరకు 50 లిక్కర్ కేసులు నమోదు చేయడం జరిగిందని, రూ. 4.94 లక్షల విలువ చేసే 536 లీటర్ల మద్యం సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. 195 మందిని బైండోవర్ చేశామని, ఆరు ఎంసీసీ వాయిలేషన్ కేసులు (MCC Violation Cases) నమోదు చేశామన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేయకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
సెన్సిటివ్ కేంద్రాలు..
జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో 14 క్రిటికల్, 14 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలకు గుర్తించామని ఎస్పీ తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను (Micro Observers) ఏర్పాటు చేశామని వివరించారు. సెన్సిటివ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సిగ్నల్స్ లేని ప్రాంతాలలో వైర్లెస్ కమ్యూనికేషన్ (Wireless Communication) ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు.