అక్షరటుడే, ఆర్మూర్: PCC Chief | మున్సిపల్ ఎన్నికల్లో బలమైన వ్యక్తులనే అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల (municipal elections) సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
PCC Chief | టికెట్ రానివాళ్లు నిరాశ చెందవద్దు..
టికెట్లు రానివారు నిరాశ చెందవద్దని వారి వారి ప్రాధాన్యత ప్రకారం పార్టీ పదవులు ఇవ్వడానికి కృషి చేస్తానని పీసీసీ చీఫ్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్లో 36 వార్డులకు గాను 140 దరఖాస్తులు వచ్చాయని, పార్టీ సర్వే అనుగుణంగా బలమైన క్యాండెట్లకు టికెట్లు ఇవ్వడo జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, తెలంగాణ కో–ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మనాల మోహన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏబీ చిన్న, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూరు ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ మార చంద్ర మోహన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, అర్బన్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ జీవన్, లింగా గౌడ్, వెంకట్రాంరెడ్డి, జిమ్మీ రవి తదితరులు పాల్గొన్నారు.