అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad | ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ కోర్టు (Nizamabad Special Court) సెకండ్ క్లాస్ జడ్జి తీర్పు చెప్పారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ (railway station) ప్రాంతంలో వీరు అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తించారు. తమ శరీరం చూపిస్తూ పురుషులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న వారిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం కోర్టులో హాజరు పర్చగా.. ముగ్గురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
