అక్షరటుడే, పెద్దకొడప్గల్: Peddakodapgal | స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో (Congress party) కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయ్, అంజనీ నాందేవ్ పటేల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
జుక్కల్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kanta Rao) ఆదేశాల మేరకు పార్టీ నుంచి వారిని తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరగుతుందన్నారు. కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, అక్కల్ సాయిరెడ్డి, మానిక్ రెడ్డి, సంజీవ్, పందిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
