అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు, ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
నగరంలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ (Sri Chaitanya Junior College)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) మక్తల్‌కు చెందిన వర్షిత ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె హాస్టల్ గదిలో చున్నితో ఉరి వేసుకుంది. గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.
Hyderabad | నిజాంపేటలో..
నిజాంపేట ప్రగతి జూనియర్ కాలేజీ (Pragathi Junior College)లో సెకండియర్ చదువుతున్న మంజూనాథ్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని సమాచారం. అమ్మాయి తల్లి, మరో మహిళ ఇంటికి వచ్చి మంజూనాథ్కు వార్నింగ్ ఇవ్వడంతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిసింది. మరోవైపు ఉస్మానియ యూనివర్సిటీ (Osmania University)లో ఇంజినీరింగ్ విద్యార్థి తనువు చాలించాడు. విజ్ఞాన్ అనే యువకుడు ఆక్సిజన్ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. హుజురాబాద్‌కు చెందిన విజ్ఞాన్ మైనింగ్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు.
