Groom dies of heart attack | తాళి కట్టిన మూడు సెకన్లకే తెగిపోయిన మూడు ముళ్ల బంధం.. గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Groom dies of heart attack : కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం.. మా నవ జీవన వేడుకకు ఇంకా వారం రోజులే ఉంది.. వధూవరులు 7days to Go అని సామాజిక మాధ్యమాల్లో ఎంతో హ్యాపీగా పోస్టు పెట్టారు. ఆ సంతోష ఘడియ రానే వచ్చింది. ఎన్నో కొంగొత్త ఆశలతో తన బెటర్​ ఆఫ్​ మెడలో తాళి కట్టాడు. తనకు వరించబోతున్న జీవితాన్ని తలచుకుని ఆ పుత్తడి బొమ్మ తబ్బుబ్బి పోయింది. కానీ, ఆ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Groom dies of heart attack : కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం.. మా నవ జీవన వేడుకకు ఇంకా వారం రోజులే ఉంది.. వధూవరులు 7days to Go అని సామాజిక మాధ్యమాల్లో ఎంతో హ్యాపీగా పోస్టు పెట్టారు. ఆ సంతోష ఘడియ రానే వచ్చింది. ఎన్నో కొంగొత్త ఆశలతో తన బెటర్​ ఆఫ్​ మెడలో తాళి కట్టాడు. తనకు వరించబోతున్న జీవితాన్ని తలచుకుని ఆ పుత్తడి బొమ్మ తబ్బుబ్బి పోయింది. కానీ, ఆ ఆనందం క్షణాలు కూడా నిలవకుండా ఆవిరైపోయింది. పెళ్లి వేడుక(wedding ceremony) కాస్త విషాదాంతంగా మారింది.

తాళి కట్టిన క్షణాల్లోనే పెళ్లి కొడుకు విగతజీవిగా మారి కుప్పకూలిపోయాడు. తాళిబొట్టుతో ఏర్పడ్డ వైవాహిక బంధం కళ్లు మూసి తెరిచేలోపలే ముగిసిపోయింది. కర్ణాటక(Karnataka)లోని జమఖండి గ్రామం(Jamkhandi village)లో గుండెను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో వధువు మెడలో తాళి కట్టిన మూడు సెకన్లకే పెళ్లి కొడుకు ప్రవీణ్​(26) గుండెపోటు(heart attack)తో మండపంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధం కుదిరినప్పటి నుంచి వధూవరులు పెళ్లి వేడుక కోసం ఎంతో గొప్పగా ప్లాన్​ వేసుకున్నారు. ప్రతీ అకేషన్​ను గొప్పగా సెల్రబేట్​ చేసుకున్నారు. వారి ప్రీ వెడ్డింగ్​ షూట్(pre-wedding shoot)​ అయితే హైలెట్​. ఇప్పుడా వీడియో చూస్తూ పెళ్లి కూతురు, ఇరు కుటుంబాల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...